టీవీ నటికి ముద్దుల పాపాయి : కుటుంబం ఘన స్వాగతం, వైరల్‌ వీడియో

Tv actress Mohena Kumari Family Gives A Grand Welcome​ her Baby Girl - Sakshi

టెలివిజన్ నటి, మోహెనా కుమారి సింగ్, సుయేష్ రావత్‌ దంపతుల ఇంట ఇటీవల ఆడబిడ్డ జన్మించింది.  అయితే బుల్లి యవరాణికి మోహెనా కుటుంబం వేడుకగా స్వాగతం పలికిన తీరు విశేషంగా నిలిచింది. ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో తల్లీ-కూతురు ఇద్దరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పాపాయికి  ఘన స్వాగతం పలికారుకుటుంబ సభ్యులు, సన్నిహితులు.

మోహెనా కుమారి సింగ్ అభిమాని పేజీ ప్రకారం, మోహెనా భర్త, సుయేష్ కుమారుడు అయాన్ష్‌ని  చేతుల్లో పట్టుకుని కనిపించాడు. పాపాయిని పరిచయం చేసినపుడు బంధువులు, స్నేహితులు ఆనందంతో స్టెప్పులు వేశారు. అటు అయాన్ష్ కూడా తన బుజ్జి చెల్లాయ్‌ని చూసి మురిసి పోయాడు. ఇల్లంతా పింక్‌ కలర్‌ (పాపాయికి పింక్‌ కలర్‌ సింబల్‌) బెలూన్స్‌, బటర్‌ ఫ్లైస్‌తో అంలంకరించారు.   కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

కాగా ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’ అనే సీరియల్‌లో 'కీర్తి గోయెంకా సింఘానియా'గా నటించి  దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న నటి మోహెనా.   నయా అక్బర్ బీర్బల్, కుబూల్ హై, సిల్సిలా ప్యార్ కా , ప్యార్ తునే క్యా కియాతో  లాంటి టీవీ సీరియల్స్‌తో పాపులర్‌ అయింది. తొలిబిడ్డగా కుమారుడు అయాన్ష్‌ పుట్టినపుడు చేతుల్లోకి మొదటిసారి పట్టుకున్నప్పుడు ఎంత భావోద్వేగానికి లోనైందీ తెలిపింది. అలాగే తన రెండో ప్రెగ్నెన్సీని కూడా భారతీయ శాస్త్రీయ నృత్యం చేస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

Election 2024

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top