Health: తొడల మీద దద్దుర్లు.. ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలివే! కారణాలేంటి? రిస్క్‌ ఎవరికి ఎక్కువ?

Health Tips: What Is Difference Between Vaginal Discharge Yeast Infection - Sakshi

డాక్టర్‌ సలహా

Vaginal Discharge-  Yeast Infection: సాధారణ వెజైనల్‌ డిశ్చార్జ్‌కి ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌కి తేడా ఏంటో చెప్తారా? – ఆలూరి సుష్మారెడ్డి, ఖానాపూర్‌
వెజైనల్‌ డిశ్చార్జ్‌ అనేది నార్మల్‌గా కూడా ఉంటుంది. ఇది నెలసరి సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా నెల మధ్యలో అండాల విడుదల సమయానికి తీగలాగా తెలుపు అవుతుంది. ఇది రెండు నుంచి అయిదు రోజులు అవుతుంది. నెలసరికి ముందు రెండు నుంచి అయిదు రోజుల వరకు థిక్‌గా ఈ వైట్‌ డిశ్చార్చ్‌ అవుతుంది.

ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి థిక్‌గా, లైట్‌గా, నీళ్లలా వైట్‌ డిశ్చార్జ్‌ ఉంటుంది. ఈ డిశ్చార్జెస్‌ ఏవీ రంగు, వాసన ఉండవు. దురద, మంట, ఎరుపెక్కడం వంటివీ ఉండవు. జ్వరం రాదు. వీటినే నార్మల్‌ వెజైనల్‌ డిశ్చార్జ్‌ అంటారు. ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ లేదా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌లో చాలా వరకు వెజైనాలో దురద, మంట, దుర్వాసన, దద్దుర్లు,  మూత్ర విసర్జనప్పుడు నొప్పి, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి.

డిశ్చార్జ్‌.. పెరుగులా, థిక్‌గా, గ్రీన్, యెల్లో కలర్స్‌లో ఉంటుంది. తొడల మీద కూడా దద్దుర్లు వస్తాయి. అయితే ఇది లైంగిక వ్యాధి కాదు. ఏడాదిలో మూడు సార్లకన్నా ఎక్కువగా ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తే దాన్ని రికరెంట్‌ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ అంటారు. దీనికి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఇన్‌ఫెక్షన్స్‌  రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.

వెజైనాలో సహజంగా ఉండే బ్యాలెన్స్‌ తప్పినప్పుడు ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. ఎక్కువ యాంటీబయాటిక్స్‌ వాడినా ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. యాంటీఫంగల్‌ క్రీమ్స్, జెల్స్, టాబ్లెట్స్‌తో ఈ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్సను అందిస్తారు. కొన్నిసార్లు వెజైనల్‌ స్వాబ్‌ అనే చిన్న స్మియర్‌ టెస్ట్‌ చేసి ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారిస్తారు. పెల్విక్‌ పరీక్ష చేసినప్పుడు ఈ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తిస్తారు. 
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

చదవండి: Veginal Infections: పబ్లిక్‌ టాయిలెట్స్‌ వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయా? నిజానికి టాయిలెట్‌ సీట్‌పై ​కంటే
Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్‌.. ఇంకా మెదడు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top