ఆ‘సక్తి’ లేకపోతే? శృంగారేచ్ఛకు బూస్ట్‌ ఇచ్చే ఫుడ్స్‌ ఇవే! | Sakshi
Sakshi News home page

ఆ‘సక్తి’ లేకపోతే? శృంగారేచ్ఛకు బూస్ట్‌ ఇచ్చే ఫుడ్స్‌ ఇవే!

Published Wed, Feb 28 2024 1:38 PM

do know these Foods to Help Boost Your Sexual Life - Sakshi

ఆధునిక జంటల మధ్య ప్రధాన సమస్య సెక్స్‌ లైఫ్‌

లిబిడో అంటే ఏంటో తెలుసా?

లిబిడో పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
 

ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారం, వ్యాయామంతోపాటు, చక్కటి లైంగిక జీవితం కూడా  చాలా అవసరం. లైంగిక ఆనందం అనేది శారీరక ,మానసిక ఆరోగ్యంపై ముడిపడి ఉంటుంది. పోషకాహారం  లైంగిక జీవితానికి  అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. లిబిడోను పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? అసలు లిబిడో అంటే ఏమిటి?  తెలుసుకుందాం..!

లిబిడో అంటే..
లిబిడో అంటే సెక్స్ డ్రైవ్ లేదా శృంగార కోరిక. ఈ శృంగారేచ్ఛ అనేది వ్యక్తికి, వ్యక్తికి మధ్య విభిన్నంగా ఉంటుంది. వారి వారి ప్రాధాన్యతలు,  జీవిత పరిస్థితులను బట్టి కూడా ఇది మారుతుంది. కొన్ని ఆరోగ్య పరిస్థితులు, హార్మోన్ స్థాయిలు, మందులు, జీవనశైలితో లిబిడో ప్రభావితమవుతుంది.

శారీరక, భావోద్వేగ, మానసిక ,సామాజిక శ్రేయస్సే  లైంగిక ఆరోగ్యం  అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  పేర్కొంది.  అలాగే  సాధారణ ఆరోగ్యం , జీవన నాణ్యతకు సంబంధించి  లిబిడో కీలకమని ఆధునిక వైద్యులు నిర్వచించారు. 

ఆధునిక ప్రపంచంలో మారుతున్న జీవనశైలి, వృత్తిపరమైన కారణాలతో చాలా మంది దంపతుల మధ్య చిచ్చు పెడుతున్న సమస్య సెక్స్ లైఫ్.  మరి లిబిడోను పెంచుకోవాలంటే కొన్ని రకాల మాంసం, చేపలు,అవకాడో , డార్క్‌ చాక్లెట్‌, కూరగాయలు , లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సుగర్‌, కొవ్వు పదార్దాలకు దూరంగా ఉండాలి. 

ఓస్టర్స్‌, (ఆల్చిప్ప ): మిగతా ఆహారంతో పోలిస్తే ఓస్టర్స్‌ లో  జింక్ చాలా ఎక్కువ లభిస్తుంది. హార్మోన్ స్థాయిలను పెంచుతుంది.  ఇలాగే స్త్రీ పురుషుల  లైంగిక అవయవాలకు రక్త ప్రవాహం పెంపునకు ఇది సహాయపడుతుంది.

పురుషుల సంతానోత్పత్తిలో జింక్ చాలా ముఖ్యం. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 2018నాటి పరిశోధన ప్రకారం, జింక్ లోపం టెస్టోస్టెరాన్ స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.వీటితోపాటు పీతల్లో జింక్‌ ఎక్కువ లభిస్తుంది. కార్నిటైన్ , ఎల్-అర్జినైన్ అనేవి వివిధ అధిక-ప్రోటీన్ ఆహారాలలో కనిపించే అమైనో ఆమ్లాలు  నిండి వున్న మాంసం కూడా లైంగిక జీవితాన్ని మంచిప్రేరణిస్తుంది. 

ముఖ్యమైన మాంసాహారం
గొడ్డు మాంసం
పంది మాంసం
 కాల్చిన బీన్స్
 సాల్మన్ పిష్‌,

సాల్మన్, పింక్-ఫ్లెడ్ ఫిష్, సార్డినెస్, ట్యూనా చహాలిబట్‌ చేపలు.  ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D ,ఐరన్  పుష్కలం.  జింక్ కూడా అధికమే. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మంచింది. ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. అయితే మాంసాహారం మితి మీరితే గుండెజబ్బులొస్తాయనేది గమనించాలి. 

శాకాహారులైతే..పాలు, చీజ్‌తోపాటు, ఇతర  తృణధాన్యాలు, నట్స్‌ నుంచి ఈ పోషకాలను పొందవచ్చు.
అక్రూట్స్‌ 
పెకాన్లు
హాజెల్ నట్స్
వేరుశెనగ
గుమ్మడికాయ గింజలు
పొద్దుతిరుగుడు విత్తనాలు
వాల్‌నట్స్‌లో ఒమేగా-3లు కూడా పుష్కలంగా ఉన్నాయి
♦ జీడిపప్పు,  బాదంపప్పులు,వీటిల్లో జింక్‌తోపాటు,  రక్తం ప్రసరణకుపయోపడే ఎల్-అర్జినైన్ ఉంటుంది.
పాలకూర
♦ అరుగూలా లేదా రాకెట్ 
♦ cress, గార్డెన్ క్రెస్ అని కూడా పిలుస్తారు
♦ ముల్లంగి

యాపిల్స్‌ 
ఆర్కైవ్స్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం యాపిల్స్‌ క్రమం తప్పకుండా తీసుకుంటే యువతులలో మంచి లైంగికతను ప్రోత్సహం లభిస్తుంది.  లైంగిక సామర్థ్యానికి పనికి వచ్చే క్వెర్సెటిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది యాపిల్స్‌. ఈ యాంటీఆక్సిడెంట్, ఒక రకమైన ఫ్లేవనాయిడ్. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. 

అవకాడో, అల్లం,కుంకుమపువ్వు
అవకాడో ఫోలేట్ అనే విటమిన్‌, ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇది తిన్నప్పుడు ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం లభించి, లైంగిగేచ్ఛపై సానుకూల  ప్రభావాన్ని చూపుతుంది. ఫెనెథైలమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాలను ఉత్పత్తి చేసి సెక్స్ డ్రైవ్‌ను పెంచుతుంది. కుంకుమపువ్వు, అల్లం సహజమైన కామోద్దీపనగా పరిగణిస్తారు. అల్లం స్త్రీ-పురుషులిద్దరిలోనూ లిబిడోను పెంచుతుందని అనేక అధ్యయనాలు తెలిపాయి.  రెడ్ వైన్ కూడా  లైంగిక పనితీరును మెరుగు పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement