‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి.. | - | Sakshi
Sakshi News home page

‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి..

Dec 2 2025 8:22 AM | Updated on Dec 2 2025 8:22 AM

‘తల్ల

‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి..

‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి.. పన్ను వసూళ్లు వేగిరపర్చాలి ఎగసిపడుతున్న అలలు

పాలకొల్లు సెంట్రల్‌: తల్లంటే పేగు బంధం.. తనువును చీల్చుకుని బిడ్డలకు ప్రాణం పోస్తుంది.. పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది.. వారి ఎదుగుదలలో ఆనందం పొందుతుంది.. అలాంటి మాతృమూర్తి వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు మరణంతో తల్లడిల్లిపోయింది.. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడి చితికి నిప్పు పెట్టింది. సాధారణంగా కొడుకులు లేని తల్లిదండ్రులకు కుమార్తెలు తలకొరివి పెట్టడం చూస్తుంటాం. అయితే అయినవాళ్లు ఎవరూ లేకపోవడంతో కుమారుడికి కన్నతల్లే తలకొరివి పెట్టిన సంఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. పాలకొల్లులోని బంగారు వారి చెరువుగట్టుకు చెందిన వల్లూరి సత్యవాణి వృద్ధురాలు. ఆమె భర్త 18 ఏళ్ల క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. కుమార్తె బ్రెయిన్‌కి సంబంధిత వ్యాధితో పదేళ్ల క్రితం మృతిచెందింది. కుమారుడు శ్రీనివాస్‌కు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా, పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అప్పటినుంచి వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్న తల్లి సత్య వాణి వద్దే శ్రీనివాస్‌ ఉంటున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనివాస్‌ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయినవాళ్లు ఎవరూ లేకపోవడతో తల్లి సత్యవాణి, పినతల్లి ఇద్దరూ కలిసి హిందూ శ్మశాన వాటికకు కైలాస రథంపై తీసుకువచ్చి కర్మకాండలు నిర్వహించారు. తల్లి సత్యవాణి తలకొరివి పెట్టగా.. బొండా చంద్రకుమార్‌ అనే వ్యక్తి ఆర్థికంగా వారికి సహకారం అందించారు. కొందరు స్థానికులు శ్మశాన వాటిక వద్దకు వచ్చి సంతాపం తెలిపారు.

భీమవరం(ప్రకాశం చౌక్‌): మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్లు వేగిరపర్చాలని మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు అన్నారు. భీమవరం మున్సిపాలిటీలో సోమవారం ఆయ న సమీక్షించారు. ఆస్తి పన్ను, నీటి పన్ను వ సూలు, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, ఈ–ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూళ్లపై సమీక్షించారు. మున్సిపాలిటీ పరిధిలో పన్ను, పన్నేతర వసూళ్లను సకాలంలో పూర్తిచేసి ఆదాయం పెంచాలన్నారు. పారిశుద్ధ్య పురోగతిపై సమీక్షించి పట్టణంలో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి వాటిని నూరుశాతం ప్రాసెస్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే పీజీఆర్‌ఎస్‌, పురమిత్ర ఫిర్యాదులను సకాలంలో సరైన పద్ధతులు పరిష్కరించాలన్నారు. క మిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌, ఆర్‌ఐలు, మున్సిపల్‌ హెల్త్‌ అధికారి పాల్గొన్నారు.

నరసాపురం రూరల్‌: తుపాను పేరు చెబితే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికంది వచ్చే సమయంలో తుపాను హెచ్చరికలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దిత్వా తుపాను ప్రభావంతో కురుస్తున్న చిరుజల్లులతో పంట నష్టపోకుండా ఒబ్బిడి చేసుకుంటున్నారు. సోమవారం పలు గ్రామాల్లో రైతులు కళ్లాల్లోని ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవడం, కోసిన వరిని ఒబ్బిడి చేసుకునే దృశ్యాలే కనిపించాయి. ఈ ఏడాది సాగుచేపట్టిన రైతులు ఆరంభంలో అధిక వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. పంట చివరి దశలో వాతావరణంలో మార్పులతో బెంబేలెత్తుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి వీస్తున్న చలిగాలులు, వర్షాలకు యంత్రాలతో కోతలు కోసి ఒబ్బిడి చేసిన ధాన్యాన్ని ఒడ్డుకు చేరుస్తున్నారు. నరసాపురం నియోజకవర్గవ్యాప్తంగా వరిసాగు చేసిన రైతులు తుపాను నుంచి గట్టెక్కించాలని దేవుడికి మొక్కుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం కూడా తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. నరసాపురం, మొగల్తూరు తహసీల్దార్లు తీర ప్రాంతాల్లో పర్యటించి ముందస్తు జాగ్రత్తలు సూచించారు.

‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి.. 
1
1/2

‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి..

‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి.. 
2
2/2

‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement