ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే
గణపవరం: కూటమి ప్రభుత్వానికి మరో పదిహేనేళ్లు అవకాశం ఇవ్వాలని ఉంగుటూరు సభలో ము ఖ్యమంత్రి చంద్రబాబు కోరడంపై ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేసి ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. ప్రజలను వంచించినందుకు మరో పదిహేనేళ్లు అవకాశం ఇవ్వాలా అని ప్రశ్నించారు. మహి ళలు, రైతులు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలను కూటమి పార్టీలు మోసం చేశాయన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. వచ్చే సంక్రాంతి నాటికి రోడ్లను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత సంక్రాంతి నాటికే రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతాయని చెప్పిన మాటలు ఇంకా ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని, నిలువెత్తు గోతులతో భయపెడుతున్నాయన్నారు.
ఉంగుటూరుకు ఏం చేశారో చెప్పకుండా..
ఉంగుటూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్ర బాబు ఎన్నో అబద్ధాలు వల్లెవేశారని వాసుబాబు అన్నారు. ఉంగుటూరు అభివృద్ధికి ఏంచేస్తారో చెప్పకుండా వైఎస్సార్‌సీపీని ప్రజల్లో దోషిగా చూపడానికి ప్రాధాన్యమిచ్చారన్నారు. కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టిన 17 నెలల కాలం గంజాయిని అరికట్టడానికి సరిపోదా అని ప్రశ్నించారు. గంజాయి స్మగ్లింగ్‌లో మహిళా డాన్‌లు కూడా ఉన్నారని, ఇందుకు గత వైఎస్సార్‌సీపీ పాలనే కారణమంటూ చంద్రబాబు అనడాన్ని వాసుబాబు ఖండించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కోనసీమ పర్యటనలో రైతులతో మాట్లాడు తూ ఇక్కడ కొబ్బరిచెట్లు పాడవడం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందా అని ప్రశ్నించగా.. లేదు అంతకుముందు ప్రభుత్వంలోనే ఉందని రైతుల చెప్పడంతో ఆయన అభాసుపాలయ్యారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ ఏ సమస్య వచ్చినా గత జగన్ పాలనే కారణమంటూ ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వీరి మాటలు నమ్మే అమాయకులు కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. జగన్ పర్యటనలకు పోటెత్తుతున్న జన సందోహమే కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తోందన్నారు.
ప్రజలను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యేవాసుబాబు ధ్వజం


