కార్మికులు పస్తులుంటే పట్టించుకోరా!
కై కలూరు పంచాయతీ కార్మికులకు 8 నెలల జీతాలు బకాయి
కై కలూరు: పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్టు సిబ్బందికి 8 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలను ఏలా పోషిస్తారు? ఇదేనా ప్రభుత్వాధికారుల తీరు అని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నిలదీశారు. కై కలూరు మేజర్ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్, నీటి సరఫరా, రిక్షా వర్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా 85 మందికి 8 నెలలుగా జీతాలు చెల్లిండడం లేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, పంచాయతీ ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. నవంబరు 1 నుంచి విధులను బహిష్కరిస్తున్నామని సమ్మె నోటీసు అందించారు. శనివారం విధులు బహిష్కరించి నీటి సరపరా, చెత్త సేకరణ నిలిపేశారు. పంచాయతీ భవానమ్మ చెరువు విద్ద నిరసన తెలిపారు. మద్దతుగా డీఎన్నార్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. జీతాలు చెల్లించకపోతే పనులు ఎలా జరుగుతాయని అన్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని జీతాలు చెల్లించే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు అన్యాయం జరిగితే సహించమన్నారు. డీఎన్నార్‌తో పాటు కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, వివిధ హోదాల నాయకులు పంజా రామారావు, సయయం అంజి, కన్నా బాబు, సిరాజుద్ధిన్, పంజా నాగు, ఎండీ.గాలిబ్‌బాబు, మడక శ్రీను, ఉండ్రమట్ల ఏసుకుమార్ ఉన్నారు.
టీడీపీ కవ్వింపు చర్యలు
పంచాయతీ కార్మికులు జీతాల కోసం చేస్తున్న సమ్మె వల్ల పరువు పోతుందని భావించిన టీడీపీ నాయకులు త్రినాథరాజు, పోలవరపు రాణి, జానీ, పడమటి వాసు, మల్యాద్రి కార్మికులతో మాట్లాడారు. ఆ సమయంలో డీఎన్నార్ సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు. పంచాయతీ ఈవో ప్రసాద్‌ను పిలిచి జీతాల ఆలస్యానికి కారణాలు అడిగారు. ఇంతలో కార్మికులు డీఎన్నార్ వద్దకు వెళ్ళి గోడు చెప్పడం జీర్ణించుకోలేక టీడీపీ నాయకుడు జానీ డీఎన్నార్‌ను ఉద్దేశించి కవ్వింపు చర్యలకు దిగాడు. దీంతో డీఎన్నార్ కూడా ఘటుగా సమాధానం చెప్పారు. 8 నెలలుగా జీతాలు చెల్లించకపోతే టీడీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని వైఎస్సార్‌సీపీ నేతలు ఘటుగా సమాధానం చెప్పారు. ఒకానొక సందర్భంలో ఇరు పార్టీల కేకలతో గందరగోళం ఏర్పడింది. చివరికు వైఎస్సార్‌సీపీ నుంచి పంజా రామారావు, టీడీపీ నుంచి పోలవరపు రాణి, త్రినాథరాజు, తాత్కాలిక సర్పంచ్ కేవీఎన్‌ఎం నాయుడు గొడవ పెద్దది కాకుండా చూశారు.
విధుల్లోకి కార్మికులు
పంచాయతీ కార్మికులకు రావల్సిన 8 నెలల జీతాలను ఈ నెల 11 లోపు కొంత, మిగిలిన బాకీ ఈ నెలాఖరుకు అందిస్తామనే హామీతో కార్మికులు సమ్మెను విరమించారు. యథావిధిగా పనులు మొదలుపెట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులు అండగా రావడంతోనే జీతాలు చెల్లింపు హామీ వచ్చిందనే భావన కార్మికులతో కనిపించింది.
కార్మికులు పస్తులుంటే పట్టించుకోరా!


