భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా? | - | Sakshi
Sakshi News home page

భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా?

Nov 2 2025 9:34 AM | Updated on Nov 2 2025 9:34 AM

భక్తు

భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా?

భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా? జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు వివాహితను వేధించిన ఘటనపై కేసు నమోదు శ్రీవారి తెప్పోత్సవానికి సర్వం సిద్ధం 3న కౌలు రైతుల ఆందోళన

దెందులూరు: రాష్ట్రంలో భక్తుల ప్రాణాల భద్రతపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం బాధాకరమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిసారి అదే నిర్లక్ష్యం అదే బాధ్యతారాహిత్యం కనబడుతోందన్నారు. గతంలో తిరుమల, సింహాచలం ఇప్పుడు శ్రీకాకుళం.. ప్రాణనష్టం జరిగిన ప్రతిసారి ఏదో కుంటి సాకు చెబుతున్నారని శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్‌లో భాగం కాదా అని ప్రశ్నించారు. వసతుల లేమి పసిగట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన ఇంటెలిజెన్‌న్స్‌ ఏం చేస్తుందన్నారు.

బుట్టాయగూడెం: పాపికొండల అభయారణ్యంలోని జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి అటవీశాఖ సీసీఎఫ్‌ ఎంఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. శుక్రవారం టేకూరు సెక్షన్‌ పరిధిలోని పాపికొండల అభయారణ్యంలో అటవీ శాల అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా అభయారణ్యం ప్రాంతంలో గ్రాస్‌ ల్యాండ్స్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించారు. అనంతరం సీసీఎఫ్‌ ఎంఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ టేకూరు సెక్షన్‌ పరిధిలో 20 హెక్టార్లలో, వాడపల్లి సెక్షన్‌ పరిధిలో 10 హెక్టారుల్లో మొత్తం 50 హెక్టారుల్లో వన్యప్రాణుల ఆహారం కోసం గ్రాస్‌ ల్యాండ్స్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసి అటవీ క్షేత్ర కార్యాలయానికి పంపించాలని రేంజ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సతీష్‌, సబ్‌ డీఎఫ్‌ఓ వెంకటసుబ్బయ్య, రేంజ్‌ అధికారులు ఎస్‌కె వల్లి, దావీదురాజు, తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: వివాహితను గదిలో నిర్భంధించి చిత్రహింసలు గురిచేసి ఆమె బావతో కాపురం చేయమని వేధించిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ షేక్‌ జబీర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్థానిక బుట్టాయగూడెంలో నివసిస్తున్న చిన్ని అమృతవల్లి భర్త చిన్ని రంజిత్‌కుమార్‌, అత్త చంద్రకళ, మామ నాగేశ్వరరావు, బావ ప్రవీణ్‌కుమార్‌, తోటికోడలు హరిప్రియపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. అమృతవల్లిని వీరు వేధించినట్లు తెలిపారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం)లో ఆదివారం రాత్రి జరుగనున్న చినవెంకన్న తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. వేడుకలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామివారు విహరించనున్న తెప్పను హంస వాహనంగా అలంకరిస్తున్నారు. అలాగే తెప్పలో పచ్చిపూల మండపాన్ని నిర్మిస్తున్నారు. భక్తులకు రక్షణ కల్పించేలా పుష్కరణి గట్లపై బారికేడ్లు నిర్మించారు. సాగరం మధ్యలోని మండపానికి, అదేవిధంగా గట్లపైన, చెట్లకు విద్యుత్‌ అలంకారాలు చేశారు. దాంతో పుష్కరణి పరిసరాలు విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. స్వామి, అమ్మవార్లు ఆలయం నుంచి తొళక్క వాహనంపై బయల్దేరి పుష్కరిణి వద్దకు రాత్రి 8 గంటల సమయానికి చేరుకుంటారని, ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

భీమవరం: కౌలురైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3 న కలెక్టరేట్‌ వద్ద ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడిశెట్టి రామాంజనేయులు, ఉందుర్తి శ్రీనివాసరావు శచెప్పారు. కూటమి ప్రభుత్వం కౌలురైతులను దగా చేసిందన్నారు. తుపాను కౌలు రైతులు పంట కోల్పోతే అధికారులు పంట నష్టం భూ యజమానుల పేరున నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా?  
1
1/2

భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా?

భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా?  
2
2/2

భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement