● నరకానికి ‘దారులు’
● అడుగడుగునా గోతులు
● వర్షం కురిస్తే చెరువులే..
కై కలూరు: చినుకుపడితే రోడ్లు తటాకాలుగా మారుతున్నాయి.. ఏ రోడ్డు చూసినా భారీ గోతులు, వర్షం నీటితో నరకానికి నకళ్లుగా భయపెడుతున్నాయి. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న రహదారులు మోంథా తుపాను తాకిడికి మరింత దెబ్బతిన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా రోడ్లు మరింత అధ్వానంగా మారి ప్రమాదాలకు నిలయమయ్యాయి. ప్రధానంగా కొల్లేరు పరీవాహక ప్రాంతమైన కై కలూరు నియోజకవర్గంలో రోడ్లపై అడుగుపెట్టేందుకు ప్రజలు హడలిపోతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో సుమారు 84 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. దీంతో ఆక్వా ఉత్పత్తులతో భారీ లారీల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అధిక లోడు వాహనాలతో గ్రామీ ణ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఇప్పటికే గుంతల పడిన రోడ్లలో వర్షం నీరు నిలిచి మరింత దెబ్బతింటున్నాయి.
జాతీయ రహ‘దారి’ద్య్రం
పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–165) కూడా అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల విస్తరణ పనులకు డబుల్ లైన్ల రోడ్డుగా తవ్వారు. అయితే పలుచోట్ల పనులు ఆలస్యం కావడంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్‌హెచ్‌పై పలు ప్రాంతాల్లో గుంతలు పడ్డాయి. ఈ గుంతల్లో వర్షం నీరు నిలిచి ప్రమాదకరంగా మారాయి.
చెరువు ఊటతో దెబ్బ
అక్వా చెరువులు అధికంగా రహదారుల సమీపంలో ఉన్నాయి. జాతీయ, గ్రామీణ రహదారుల కిందకు చెరువుల నీటి ఊట చేరడంతో భూమి గుల్లగా మారి త్వరగా పాడవుతున్నాయి. కలిదిండి మండలంలో మద్వానిగూడెం–పెదలంక, మూలలంక–పెదలంక, ఆరుతెగళపాడు, కాళ్లపాలెం, కొండూరు రహదారులు, ముదినేపల్లి మండలం సింగరాయపాలెం–కోరుకొల్లు, జాతీయ రహదారి నుంచి కోడూరు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి.
కలిదిండి మండలంలో పెదలంక రోడ్డు
ముదినేపల్లి మండలం పెదకామనపూడి వద్ద..
రహ‘దారుణాలు’
రహ‘దారుణాలు’


