నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె

Nov 1 2025 7:44 AM | Updated on Nov 1 2025 7:44 AM

నేటి

నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె

నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె మూడు నెలల పాటు ‘మీ డబ్బు.. మీ హక్కు’ శోభనాచలుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఉధృతంగా యనమదుర్రు డ్రెయిన్‌

కై కలూరు: కై కలూరు మేజర్‌ పంచాయతీలో కాంట్రాక్టు సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో శనివారం నుంచి విధులకు హాజరుకాలేమని పంచాయతీ ఈఓ ప్రసాద్‌కు కార్మికులు శుక్రవారం నోటీసు అందించారు. శానిటేషన్‌, విద్యుత్‌, వాటర్‌ వర్ట్స్‌, రిక్షా పుల్లర్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు ఇలా దాదాపు 85 మందికి రూ.56 లక్షల జీతాలను చెల్లించాల్సి ఉంది. జీతాలు చెల్లించకపోతే విధులకు రాలేమని కార్మికులు తెగేసి చెప్పారు. దీనిపై పంచాయతీ ఈవో ప్రసాద్‌ను వివరణగా కోరగా సమస్యను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ దృష్టికి తీసుకువెళ్లానని, జిల్లా పంచాయతీ అధికారిని కలిసి సమస్యను తెలియజేశానన్నారు. సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు, సాంకేతిక అంశాల వల్ల జీతాలు చెల్లింపు ఆలస్యమైందని, ప్రత్యేకాధికారి ద్వారా సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు.

ఏలూరు(మెట్రో): మీ డబ్బు.. మీ హక్కు నినాదంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం కార్యక్రమం పోస్టర్లను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పౌరులు తమ పేరు మీద ఉన్న క్లయిమ్‌ చేయని లేదా మరిచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. బ్యాంకుల్లో డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులను సరైన పత్రాలతో పొందవచవ్చన్నారు. కార్యక్రమంపై శనివారం కలెక్టరేట్‌లో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌తో పాటు జిల్లాలోని బ్యాంకుల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తా మన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నీలాద్రి, బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, కృత్తిక దీపోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రా రంభమయ్యాయి. అర్చకులు వేదాంతం శేషు ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, నవ కలశ పంచామృత స్నపన, స్వామి వారి ప్రత్యేక అలంకరణ, పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం వినియోగం నిర్వహించారు. ఆ లయ ఈఓ సాయి పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

భీమవరం అర్బన్‌: మండలంలోని గొల్లవానితిప్ప, యనమదుర్రు, దిరుసుమర్రు, దెయ్యాలతిప్ప, గూట్లపాడు, తోకతిప్ప, నాగిడిపాలెం, లోసరి గ్రామాలను ఆనుకుని యనమదుర్రు డ్రెయిన్‌ ఉధృతంగా ప్రవహిస్తోంది. మోంథా తుపాను కారణంగా ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఎర్రకాలువకు వరద పోటు ఎక్కువై యనమదుర్రు డ్రెయిన్‌ ద్వారా నీరు ఉప్పుటేరులో కలుస్తోంది. డ్రెయిన్‌ను ఆనుకుని వరి చేలు, చేపలు, రొయ్యలు చెరువులు ఉన్నాయి. డ్రెయిన్‌ ఉధృతంగా ప్రవహించడంతో తమ చేలల్లోని ముంపు నీరు లాగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి దుబ్బులు కుళ్లిపోతున్నాయని, మరో మూడు, నాలుగు రోజులు ఇలానే ఉంటే తీవ్ర నష్టం తప్పదని వాపోతున్నారు.

నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె 1
1/3

నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె

నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె 2
2/3

నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె

నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె 3
3/3

నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement