పాములు కరుస్తున్నా.. పట్టదా?
ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై విషసర్పాల సంచారం ఎక్కువైంది. భక్తులతో పాటు దేవస్థానం సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 8లో u
చంద్రబాబు పాలనలో రైతులకన్నీ కష్టాలే
మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు
గణపవరం: చంద్రబాబు పాలనలో రైతులకు ఎప్పు డూ న్యాయం జరగలేదని, కనీసం ఇప్పుడైనా మోంథా తుపానుతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. శుక్రవారం ఆయన కాశిపాడు, పిప్పర, కోమట్లపాలెం గ్రామాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులకు న్యాయం జ రిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టామని, మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తుందన్న సమయంలో తు పాను తుడిచి పెట్టేసిందని రైతులు బోరుమన్నారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ గత ప్ర భుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులకు ఉ చిత పంటల బీమా అమలు చేసి ఆదుకున్నారని, అ యితే కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను దూరం చేసి రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు. గణపవరం మండలంలో 2,000 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు అఽధికారులు అంచనా వేశారని, నష్టపోయిన రైతులందరికీ పంట రుణా లు రద్దుచేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులనూ ఆదుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ స లహాసంఘం మాజీ అధ్యక్షుడు వెజ్జు వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు కురెళ్ల వెంకటరత్నం, మల్లంపల్లి సు రేష్, నాయకులు ఐఎన్ రాజు తదితరులు ఉన్నారు.


