ప్రైవేటీకరణ ప్రయత్నాలను తిప్పికొడదాం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో పేదలకు వైద్య విద్యను దూరం చేసేలా కూటమి సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ ఏ లూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జ యప్రకాష్ (జేపీ) పిలుపునిచ్చారు. మెడికల్ కా లేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవులు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కండ్రికగూడెం సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించలేక కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి పారిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా పేదలకు వైద్యాన్ని దూరం చేసిందన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ వైద్య వ్యాపారానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాయకులు గుడిదేసి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్, దాసరి రమేష్, జిజ్జువరపు విజయ నిర్మల, పిట్టా ధనుంజయ్, చిలకపాటి డింపుల్ జాబ్, కిలారపు బుజ్జి, కొల్లిపాక సురేష్, మరడా అనిల్, బుద్దాల రాము, సముద్రాల చిన్ని తదితరులు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు.


