9,200 హెక్టార్లలో వరికి నష్టం
ఉంగుటూరు: జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో 9,200 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనాల్లో తెలుస్తుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం మండలంలోని ఉంగుటూరు, నాచుగుంట కాగుపాడు, నారాయణపురం ఆయకట్టులో దెబ్బతిన్న చేలను ఎమ్మెల్యే ప త్సమట్ల ధర్మరాజుతో కలిసి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. పంట రక్షణకు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 3,200 హెక్టార్లలో వరి దెబ్బతిందని, అరటి, మినుము పంటలు కూడా దెబ్బతిన్నాయని కలెక్టర్ అన్నారు. ఆర్డీఓ అచ్చుత అంబరీష్, వ్యవసాయ శాఖ జేసీ హబీబ్ బాషా తదితరులు ఉన్నారు.


