
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఏలూరు జిల్లా పావులూరివారి గూడెంకు చెందిన శ్రీనివాస భజన మండలి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,10,790 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.

మద్దిలో అభిషేక సేవ