
● రహదారి.. చెరువుగా మారి
చెరువులో నుంచి ఏంటి యువకులు నడిచి వెళుతున్నారు అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్టే.. ఇది చింతలపూడి మండలంలోని ముక్కంపాడు గ్రామానికి వెళ్లే రహదారి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులా మారింది. దీంతో శనివారం ఉదయం నుంచి నడుములోతు నీటిలో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. ముక్కంపాడుకు రోడ్డు నిర్మాణం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, వర్షం కురిస్తే రోడ్డు పూర్తిగా జలమయమవుతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.
– చింతలపూడి