
641 కిలోల గంజాయి ధ్వంసం
భీమవరం : జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్ల పరిధిలో 64 కేసుల్లో సుమారు 641 కిలోల గంజాయిని బుధవారం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామపరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ వద్ద ధ్వంసం చేసినట్లు తెలిపారు. ధ్వంసం చేసిన గంజాయిని ముందుగా ఈనెల 8న భీమవరం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని రిసెప్షన్ హాల్లో మధ్యవర్తుల సమక్షంలో కేసుల వారీగా తూకం వేసి పరిశీలించి దానిని ప్రత్యేక కవర్లు, సంచులలో పెట్టి సీలు వేసి పోలీసు బందోబస్త్ మధ్య గుంటూరు తరలించినట్లు పేర్కొన్నారు.