కుమారుడిపై తల్లి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

కుమారుడిపై తల్లి ఫిర్యాదు

Jul 10 2025 6:31 AM | Updated on Jul 10 2025 6:31 AM

కుమార

కుమారుడిపై తల్లి ఫిర్యాదు

ముదినేపల్లి రూరల్‌: మద్యం మత్తులో తనపై దాడి చేస్తున్నాడంటూ కుమారుడిపై తల్లి స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వాడవల్లికి చెందిన నిమ్మగడ్డ నాగేశ్వరరావు, మేరమ్మ దంపతులకు నలుగురు కుమారులున్నారు. తండ్రి నాగేశ్వరరావు అనారోగ్యంతో మంచంపై ఉన్నాడు. చివరి కుమారుడైన విజయకుమార్‌ భార్యను వదిలేసి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విజయకుమార్‌ మద్యం మత్తులో కత్తిపీటతో తనపై దాడి చేసినట్లు మేరమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యుత్‌ అధికారుల బదిలీలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలో పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఆ సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పృథ్వీతేజ్‌ ఇమ్మడి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన పదోన్నతుల్లో నిడదవోలు విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయానికి జేఓగా నియమితులైన సీహెచ్‌ శ్రీనివాసరావును పరిపాలనా సౌలభ్యం కోసం రామచంద్రాపురం విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే రామచంద్రాపురం విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయానికి ఇటీవల పదోన్నతిపై వెళ్ళిన ఎంవీఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌ను నిడదవోలు విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు.

జెడ్పీ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

ఇరగవరం : మండలంలోని ఇరగవరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను బుధవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ స్కూలు ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకంలో తయారు చేసే వంటశాలకు వెళ్లి వండిన వంటకాలను, స్టాక్‌ రూములో ఉన్న స్టాకును పరిశీలించారు. గురువారం నిర్వహించే మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ డే మీట్‌ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ ఖతీబ్‌ కౌసర్‌ భానో, తహసీల్దార్‌ ఎం.సుందర్‌ రాజు ఉన్నారు.

విద్యాసంస్థల బస్సులపై 18 కేసులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లావ్యాప్తంగా బుధవారం వాహన తనిఖీ అధికారులతో విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేయించినట్టు ఏలూరు ఇన్‌చార్జ్‌ రవాణా శాఖాధికారి ఎస్‌బీ శేఖర్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం వివిధ విద్యా సంస్థలకు చెందిన 63 బస్సులను తనిఖీ చేసినట్టు తెలిపారు. వాటిలో పన్నులు చెల్లించని, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని, పలు నిబంధలను అతిక్రమించిన 18 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో ప్రారంభమైన కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్వహించే బస్సులన్నీ నిబంధనలకు లోబడి తిప్పాలని, అన్ని బస్సులు పూర్తి ఫిట్‌నెస్‌తో, ఇన్సూరెన్స్‌తో, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన డ్రైవర్లతో మాత్రమే తిప్పాలని సూచించారు.

కుమారుడిపై తల్లి ఫిర్యాదు 1
1/1

కుమారుడిపై తల్లి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement