
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి, ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బొర్రంపాలెం పీహెచ్‌సీ వైద్యశిబిరం సిబ్బంది ఆలయ ప్రాంగణంలో భక్తులకు వైద్య సేవలు అందించారు. ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిణి కె.అనురాధ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మండపం వద్ద వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,99,207 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. సుమారు వెయ్యి మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించారు.