
తడి బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో మృతి
కై కలూరు: ఉతికిన తడి బట్టలు దండెంపై ఆరేస్తుండగా ఇనుప రాడ్డుకు తాకి విద్యుదాఘాతానికి గురై వివాహిత మృతి చెందిన ఘటన పెంచికలమర్రు గ్రామంలో సోమవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెంచికలమర్రుకు చెందిన జయమంగళ చిన సుబ్బరావు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గంగ(50) గృహిణి. మంగళవారం ఇంటి దగ్గర ఉతికిన తడి బట్టలు దండెంపై ఆరేస్తుండగా సమీపంలో ఉన్న ఇనుప రాడ్డుకు ఉన్న మెయిన్ వైరు కారణంగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.