మందుల షాపుల్లో విస్తృతంగా తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

మందుల షాపుల్లో విస్తృతంగా తనిఖీలు

Jul 9 2025 6:38 AM | Updated on Jul 9 2025 6:38 AM

మందుల

మందుల షాపుల్లో విస్తృతంగా తనిఖీలు

జంగారెడ్డిగూడెం: పట్టణంలో మంగళవారం పలు మందుల షాపుల్లో ఔషద నియంత్రణ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి బిల్లులు లేని మందులను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ డి,కళ్యాణ చక్రవరి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ అబిద్‌ ఆలీ విలేకరులతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో జ్యోతి మెడికల్స్‌, వాసవీ మెడికల్స్‌, లక్ష్మీసూర్య గణేష్‌ మెడికల్‌ షాపులను సీజ్‌ చేసినట్లు చెప్పారు. అలాగే లక్ష్మీ శ్రీనివాస మెడికల్స్‌ షాపులో తనిఖీ చేయగా, షాపు యజమాని కొయ్యలగూడెం షాపునకు బిల్లులు లేకుండా మందులు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గత నాలుగు రోజులుగా బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. బుట్టాయగూడెంకు చెందిన కె.గణేష్‌ హైదరాబాద్‌ నుంచి బిల్లులు లేకుండా గర్భ విచ్ఛిత్తి, వయాగ్రా లాంటి మందులు కొనుగోలు చేసి మోటార్‌సైకిల్‌పై తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బుట్టాయగూడెంలో లక్ష్మీదుర్గ, కార్తికేయ మెడికల్‌ షాపులు, కొయ్యలగూడెంలో మురళీకృష్ణ మెడికల్‌ షాపును సీజ్‌ చేశామని, వీరికి నోటీసులు జారీ చేసి లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. త్వరలో మరికొన్ని మండలాల్లో దాడు లు చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ.లక్ష విలువైన మందులను సీజ్‌ చేశామన్నారు. నూజివీడు, ద్వారకాతిరుమల, అత్తిలిలో మూడు మెడికల్‌ షాపుల లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో తణుకు డీఐ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

స్కూల్‌ బస్సు ఢీకొని

వ్యక్తి మృతి

కామవరపుకోట: స్కూల్‌ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తడికలపూడిలో జరిగింది. ఎస్సై చెన్నారావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు మండలం జాలిపూడి గ్రామానికి చెందిన గండికోట నవీన్‌ (40) గండిగూడెం గ్రామంలో పదేళ్ల నుంచి వ్యవసాయ పనులు చేసుకుంటూ అత్తవారింటిలో ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సొంతూరు జాలిపూడి వెళ్లే నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తడికలపూడి గ్రామంలో శ్రీనివాస వే బ్రిడ్జి దగ్గరకు వచ్చేసరికి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నవీన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు.

మందుల షాపుల్లో  విస్తృతంగా తనిఖీలు 1
1/1

మందుల షాపుల్లో విస్తృతంగా తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement