
ఏలూరు వేగా జ్యూయలర్స్ లక్కీ డ్రా విజేతలు వీరే
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేగా జ్యుయలర్స్ గత నెలలో తమ 5వ షోరూంను ఏలూరులో ప్రారంభించిన సందర్భంగా ఖాతాదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రవేశ పెట్టిందని, దానిలో భాగంగా మంగళవారం లక్కీడ్రాను ఖాతాదారుల సమక్షంలో నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లక్కీ డ్రాలో గెలుపొందిన అయిదుగురికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల విలువైన డైమండ్ నెక్లస్‌ను యాజమాన్యం అందజేసినట్లు చెప్పారు. లక్కీ డ్రా విజేతలుగా టీ ఆరుణశ్రీ (గన్ బజార్, ఏలూరు), ఏ.శారదా దేవి (హనుమాన్ జంక్షన్), (వీ.రాంబాబు, ఏలూరు), గండికోట నాగలక్ష్మి (ఏలూరు), టీ.శత్రుఘ్నకుమార్ (పవర్ పేట, ఏలూరు) నిలిచారన్నారు. లక్కీ డ్రా సందర్భంగా విజేతలకు వేగా జ్యుయలర్స్ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్ కుమార్, డైరెక్టర్లు వనమా సుధాకర్, చిట్లూరి నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాతాదారుల కోరిక మేరకు ప్రస్తుతం అందిస్తున్న ఆఫర్లు కొనసాగిస్తున్నామని రూ.లక్ష కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం, పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రూ.100 అదనంగా చెల్లించటం, డైమండ్ ధర క్యారెట్‌కు రూ.51,999 మాత్రమే అని తెలిపారు. ఈ ఆఫర్లు ఏలూరు షోరూమ్‌లో ఈ నెల 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు.