
దోమలపై దండెత్తరే?
వర్షపు నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దోమల విజృంభణతో విష జ్వరాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. 8లో u
నేడు ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ ప్రారంభం
కై కలూరు: ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రజలకు వివరించేందుకు ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో శుక్రవారం ప్రారంభిస్తున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. దెందులూరు పార్టీ ఇన్‌చార్జి కొఠారు అబ్బయ్య చౌదరి క్యాంప్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, దెందులూరు నియోజకవర్గ సమావేశం జరుగుతోందన్నారు. కై కలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉదయం 8.00 గంటలకు కై కలూరు ఏలూరు రోడ్ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలన్నారు.
పట్టిసీమ నీరు విడుదల
పోలవరం రూరల్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం నీటిని విడుదల చేశారు. ముందుగా 24 పంపులకు పూజలు నిర్వహించి కుడి కాలువలోకి నీరు విడుదల చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం రెండు పంపుల ద్వారా కుడి కాలువలోకి నీరు విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి విడుదలను క్రమేపీ పెంచే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. అనంతరం డెలివరీ సిస్టమ్ వద్ద గోదావరి నీటికి పూజలు నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

దోమలపై దండెత్తరే?