జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక | Sakshi
Sakshi News home page

జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక

Published Fri, Dec 22 2023 1:40 AM

- - Sakshi

తాడేపల్లిగూడెం రూరల్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సం రోజున పార్టీలో చేరడం మంచి నిర్ణయమని ఏఎంసీ చైర్మన్‌ ముప్పిడి సంపత్‌కుమార్‌ అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని పెదతాడేపల్లిలో బండారు శ్రీకాంత్‌, తోట గణపతి ఆధ్వర్యంలో పలువురు జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి ఏఎంసీ చైర్మన్‌ సంపత్‌కుమార్‌ పార్టీ కండువాలు వేసి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనను చూసి ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ కై కాల శ్రీనివాస్‌, పెదతాడేపల్లి సొసైటీ చైర్మన్‌ పరిమి తులసీదాస్‌, కారింకి వీర్రాజు, ఆలపాటి కాశీవిశ్వేశ్వరరావు, పరిమి ప్రసాద్‌, రేలంగి సత్యనారాయణ, చిటకన శ్రీనివాసరావు, కట్టా ఏసు, పోతుల శ్రీను, రేలంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement