● బాక్స్ బద్దలు..
అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు తమకు కలిగే ఇబ్బందులపై అధికారులకు ఫిర్యాదు చేయడానికి పెట్టిన ఫిర్యాదుల పెట్టె ఇది. దీనిని పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేశారు. ఈ పెట్టె తలుపు విరిగిపోయి లోపలకు పోయింది. ఇందులో వేసిన ఫిర్యాదులు, సలహాలు, సూచనల పేపర్లు కింద పడిపోతున్నాయి. విశేషమేమిటంటే దీనికో తాళం వేశారు. స్పందన దేవుడెరుగు.. ముందు ఫిర్యాదు పెట్టైనెనా మార్చండని భక్తులు అంటున్నారు.
–అన్నవరం
● సంగోతి తెలుసా!
కడియం హైస్కూల్ సమీపంలో గోతులతో జనం నరకం చూస్తున్నారు. ఇటుగా వెళ్తున్న ఓ యువకుడు రోడ్డుపై ఉన్న గోతులను పూడ్చేందుకు తన ఇంటి వద్ద నుంచి కాంక్రీట్‌ను మోటారు సైకిల్‌పై తీసుకువచ్చి భారీ గోతులు పూడ్చడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. సదరు యువకుడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురిసింది. అదే సమయంలో కడియం వయా వీరవరం నుంచి దుళ్ల రోడ్డులో ప్రయాణం నరకంలా మారిందని ప్రభుత్వాన్ని జనం విమర్శిస్తున్నాయి. –కడియం
● అపురూపం.. ఆ నాణెం
ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా విడుదలైన రూ.150 వెండి నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముంబయి టంకశాల ఈ వెండి నాణేన్ని విడుదల చేసింది. నాణెంపై ఓ వైపు ముఖ విలువ, రెండో వైపు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రాన్ని ముద్రించారు.
–అమలాపురం టౌన్
● బాక్స్ బద్దలు..
● బాక్స్ బద్దలు..


