అవినీతిపై అవగాహన ర్యాలీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించి ప్రజల్లో అవినీతిపై అవగాహన కల్పించే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్ అన్నారు. విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ సందర్భంగా శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏసీబీ కార్యాలయం ఆధ్వర్యంలో మోరంపూడి వద్ద విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ర్యాలీ ప్రారంభించారు. కిశోర్‌కుమార్ మాట్లాడుతూ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా ప్రజల్లో అవినీతిపై అవగాహన కల్పించి, అవినీతి రహిత సమాజం స్థాపించాలన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు తమ పని చేయడానికి ఎవరినైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064, 9440446160, 9440446161, 8332971041, 9440446163 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ డి,వాసుకృష్ణ, వై.సతీష్, ఎస్‌ఐ ఎస్.విల్సన్‌బాబు, ఏసీబీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


