కాకినాడ సిటీ: జేఎన్‌టీయూకే ప్రాంగణంలో ఓక్ ఉత్సవాల్లో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఇన్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్–2047 అనే అంశంపై నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ చైర్మన్ అనిల్ సహస్ర బుద్ధే ఆన్‌లైన్ ద్వారా మాట్లాడారు. భారతదేశంలో పూర్వకాలంలో నిర్వహించిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల సంస్కృతిని కొనియాడారు. వర్గీస్ కురియన్, స్వామినాథన్, ఎఫ్‌సీ కొహ్లీ వంటి ప్రముఖుల పరిశోధనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని విశదీకరించారు. వికసిత్ భారత్–2047కు విద్యా వ్యవస్థ పటిష్టం కావాలని, స్టార్టప్, స్కిల్, మేకిన్, డిజిటల్, క్లీన్ ఇండియా, క్లీన్ ఆంధ్ర, డిజిటల్ లావాదేవీలు మెరుగుపడాలన్నారు. సౌత్ ఏషియన్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ కేకే అగర్వాల్, యూజీసీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ వేద్ ప్రకాష్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్, యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ జానకీరామ్ మాట్లాడారు. రోల్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ టూ కొలాబొరేట్ విత్ అకడమిక్ ఇనిస్టిట్యూషన్, టు రియలైజ్ ద అబ్జక్టివ్ ఆఫ్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్–2047 అనే అంశంపై ప్యానల్ చర్చలు నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, యూనివర్శిటీ ఉపకులపతి సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఓక్ ఉత్సవ కమిటీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ పాల్గొన్నారు.