
డిప్యూటీ సీఎం వవన్‌కు కార్మికుల ఆకలి బాధలు పట్టవా?
రాజమహేంద్రవరం రూరల్: శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి కార్యికులు పదిరోజులుగా సమ్మె చేస్తున్నా సంబంధితశాఖలు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు కార్మికులు ఆకలిబాధలు పట్టవా అంటూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీఎన్ పూర్ణిమరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలాచెరువు ఆర్‌డబ్ల్యూఎస్ కార్యనిర్వహక ఇంజినీర్ కార్యాలయం వద్ద సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఉన్న శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికుల తమ న్యాయమైన డిమాండ్ల అమలు కోసం చేస్తున్న సమ్మె 10వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి పూర్ణిమరాజు మాట్లాడుతూ కార్మికులు 19 నెలలుగా జీతాలు, 26 నెలలుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించాలని పదిరోజుల నుంచి సత్యసాయి కార్మికులు సమ్మె చేస్తున్న కాంట్రాక్టర్, అధికారులు, పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. జీతాలు చెల్లించకపోతే కార్మికులు ఏం తిని బతకాలని, కుటుంబాలను ఎలా పోషించాలో పవన్ కళ్యాణ్ చెప్పాలని కోరారు. చీపురుపల్లి మాజీ సర్పంచ్ ములగ చినబాబు సంఘీభావం తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు పీ.శ్రీను, ప్రధాన కార్యదర్శి ఇసాక్ పాల్గొన్నారు.