
ఈ–మ్యాగజైన్ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని డైట్‌లో విద్యాగౌతమి మంత్లీ ఈ–మ్యాగజైన్‌ను ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎం జయశ్రీ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డైట్‌లో జరిగిన కార్యక్రమాలు, ఛాత్రోపాధ్యాయుల కథలు, కవితలు, వ్యాసాలు, అధ్యాపకుల రచనలతో ఈ–మ్యాగజైన్‌ను నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని డైట్‌లకు ఆన్‌లైన్‌లో ఫ్లిప్ బుక్ రూపంలో పంపిస్తామని తెలిపారు.
అడవుల సంరక్షణే ధ్యేయం
రాజానగరం: అడవులు, వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని ఏపీసీసీఎఫ్ డాక్టర్ శాంతిప్రియా పాండే అన్నారు. దివాన్ చెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్టు అకాడమీలో శిక్షణను పూర్తి చేసుకున్న 126వ బ్యాచ్ ఫారెస్టు బీట్ అధికారులకు బుధవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విధంగా రాష్ట్రంలో శిక్షణ పొందాల్సిన ఉద్యోగులు 400 మంది వరకూ ఉన్నారన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం సీసీఎఫ్ బీఎన్‌ఎన్ మూర్తి, అకాడమీ డైరెక్టర్ బి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల
షెడ్యూల్ విడుదల
రాయవరం: ఏపీ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక పాఠశాల స్థాయి కాంప్లెక్స్, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్, మార్గదర్శకాలు, అజెండా, సెషన్ వారీ అంశాలను వెల్లడించారు. ఉపాధ్యాయుల బోధనా తీరు మెరుగుదలకు, వారు బోధనలో ఎదుర్కొనే సవాళ్లు, వాటి పరిష్కారాల కోసం ఈ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తారు. గతంలో ఉమ్మడి జిల్లాలో 123 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉండగా, ప్రస్తుతం వీటిని 87 క్లస్టర్ కాంప్లెక్స్‌లుగా మార్పు చేశారు. కాంప్లెక్స్ సమావేశాలను ప్రస్తుతం ఒక పూటకు కుదించారు. ఉదయం పాఠశాలను నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులు మధ్యాహ్నం స్కూల్ కాంప్లెక్స్‌లకు హాజరై సమావేశాలను నిర్వహించాలి. వీటి ద్వారా ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. జూలై 19, ఆగస్టు 23, సెప్టెంబర్ 20, అక్టోబర్ 18, నవంబర్ 22, డిసెంబర్ 20, జనవరి 24, ఫిబ్రవరి 21 తేదీల్లో ఎనిమిది కాంపెక్స్ సమావేశాలు జరుగుతాయి.

ఈ–మ్యాగజైన్ ఆవిష్కరణ