
జీజీహెచ్‌కు వైద్య పరికరాల అందజేత
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌కు ఓఎన్‌జీసీ, యూనివర్సిటీ ఆఫ్ బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెమిని ఎడిబుల్ ఆయిల్ సంస్థలు సంయుక్తంగా రూ.78.77 విలువైన వైద్య పరికరాలను అందించాయి. ఈ యంత్ర పరికరాలతో పాటు న్యూరో ఓపీ షెడ్‌ను మంగళవారం కలెక్టర్ షణ్మోహన్, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ సంస్థల వితరణతో ట్రామాకేర్ బ్లాక్, న్యూరాలజీ, పల్మనాలజీ, అనస్థీషియా, కార్డియాక్ విభాగాలకు చెందిన వైద్య పరికరాలు సమకూరాయన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, రంగరాయ వైద్య కళాశాల డాక్టర్ విష్ణువర్దన్, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, ఓఎన్‌జీసీ జీఎంహెచ్‌ఆర్ కె.సునీల్ కుమార్, సీపీవో త్రినాథ్, ఏపిఎంఎస్‌ఐజీసీ ఈఈ సీహెచ్.రత్నరాజు పాల్గొన్నారు.