
ఘనంగా కవలల సమ్మేళనం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కవల పిల్లల పెంపకం, వారి జీనవ విధాన శైలి తదితర అంశాలను తెలియజేయాలని వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 108 కవల పిల్లల జంటలను ఒకే చోట ఉంచి వారి ప్రతిభ పాటవాలను వెలికితీయడానికి కాకినాడ సూర్యకళా మందిరం ఆదివారం వేదికగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాలతో సందడి చేశారు. వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ చైర్‌పర్సన్, అడ్మిన్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నాళం అండాళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ, జిల్లా గవర్నర్ బంగర్రాజు, వైస్ ప్రెసిడెంట్ సిద్దా వెంకటసూర్యప్రకాశరావులు హాజరై వాసవీ క్లబ్ ఆశయాలు, విశిష్టిత తెలియజేశారు. కవల పిల్లలకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసి వారి ప్రతిభను కొనియాడారు. అనంతరం ఇద్దరు విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా సుచిత్ర, చావలిసూర్యకుమారి, రాజ్యలక్ష్మి వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి గర్లపాటి శ్రీనివాసులు, బొడా సాయిసూర్యప్రకాష్, సూజాత, గ్రంధి బాబ్జి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల నుంచి 108 మంది హాజరు