
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
దేవరపల్లి: మండలంలోని గొల్లగూడెంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు గోపాలపురం మండలం వేళ్లచింతలగూడేనికి చెందిన మందపాటి రాజేష్ (24) గోపాలపురంలోని కేబుల్ ఆపరేటర్ శ్రీధర్ రెడ్డి వద్ద పార్ట్ టైమ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం దేవరపల్లి మండలం గొల్లగూడెంలో విద్యుత్ స్తంభం ఎక్కి కేబుల్ వైరు కడుతుండగా, పై భాగంలో ఉన్న 11 కేవీ హైటెన్షన్ లైన్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజేష్ అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. మృతుడి తండ్రి చంటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపారు.