
వ్యక్తి ఆత్మహత్య
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ పత్రికలో కంట్రిబ్యూటర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరంలోని ఓ పత్రికలో మెట్ల కుమార్ పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వస్థలం అమలాపురం కాగా, రాజమహేంద్రవరం రూరల్ నేతాజీ నగర్‌లో నివసిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెందిన కుమార్ గత నెల 23న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతని కోసం బంధువులు, స్నేహితులు గాలించినా ఫలితం లేదు. ఈ ఘటనపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం తూర్పు రైల్వే స్టేషన్ క్వార్టర్స్‌లోని పార్కు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని టూ టౌన్ పోలీసులకు తెలిపారు. వెంటనే వారు ఆ ప్రాంతానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. అతని జేబులో పుస్తకం లభించింది. అందులో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు తనను క్షమించాలని రాసి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.