
చికిత్స పొందుతూ యువతి మృతి
అంబాజీపేట: గంగలకుర్రు అగ్రహారం శివారు పీర్మాయిపాలెం హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువతి సోమవారం రాత్రి మృతి చెందింది. అంబాజీపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కొర్లపాటివారిపాలేనికి చెందిన మిండుగుదిటి పవిత్ర ధనలక్ష్మి (21) ఈ నెల 5న మోటారు సైకిల్‌పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన మోటారు సైకిలిస్టు ఢీకొన్నాడు. ఈ ఘటనలో ధనలక్ష్మి తీవ్రంగా గాయపడింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె సోదరుడు మిండుగుదిటి సిద్ది వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ వి.సత్యనారాయణ తెలిపారు.
మరో ఘటనలో..
అంబాజీపేట: తను ఒంటరిగా జీవిస్తూ మరొకరిని ఇబ్బందులకు గురి చేయడం ఇష్టం లేక పురుగుమందు తాగిన వృద్ధుడు.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిరతపూడికి చెందిన దార్లంక సత్యనారాయణ (75) ఈ నెల 5న పురుగుల మందు తాగి వాంతులు చేసుకున్నాడన్నారు. బంధువులు వెంటనే కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందాడన్నారు. మృతుడి అన్న కుమారుడు దార్లంక గోపికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావు తెలిపారు.
పశువైద్యాధికారి శ్రీనివాసు మృతి
ఆలమూరు: నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఏడీ నాన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చైర్మన్, పినపళ్ల గ్రామీణ పశు వైద్యాధికారి ఈదల శ్రీనివాసు (61) మంగళవారం మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గుమ్మిలేరు, చింతలూరు, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, పినపళ్ల గ్రామాల్లో ఆయన పశువైద్యాధికారిగా సేవలందించారు.