తైక్వాండో క్రీడాకారులకు అభినందన | - | Sakshi
Sakshi News home page

తైక్వాండో క్రీడాకారులకు అభినందన

Jul 7 2025 6:26 AM | Updated on Jul 7 2025 6:26 AM

తైక్వాండో క్రీడాకారులకు అభినందన

తైక్వాండో క్రీడాకారులకు అభినందన

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): తాడిపత్రిలో ఇటీవల జరిగిన జాతీయ, రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం ఆదివారం కాకినాడ శ్రీనగర్‌ మున్సిపల్‌ స్కూల్‌లో జరిగింది. దీనికి డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమానికి జిల్లా తైక్వాండో సంఘ కార్యదర్శి, కోచ్‌ బి.అర్జునరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో 11వ సారి ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు సాధించారన్నారు. హరిద్వార్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 12 పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. తైక్వాండో కోచ్‌ అర్జునరావు మాట్లాడుతూ స్టేట్‌ మీట్‌లో 38 బంగారు, 12 రజత, 17 కాంస్య పతకాలు తూర్పు క్రీడాకారులు కై వసం చేసుకున్నారని తెలిపారు. జీజీహెచ్‌ వైద్యులు ప్రవీణ, అసోసియేషన్‌ సభ్యులు సత్యనారాయణ, తులసి, రత్నం, అఖిల, కేవీ సత్యనారాయణ, తేజ, అరుణ, ప్రసన్న పాల్గొన్నారు.

కామనగరువులో అగ్ని ప్రమాదం

అమలాపురం రూరల్‌: కామనగరువు గ్రామ పరిధి జంగంపాలెంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. తొలిత వాసంశెట్టి మంగతాయారు ఇంటి నుంచి రేగిన నిప్పు రవ్వల కారణంగా దొంగ నాగలక్ష్మి, కుంచే వెంకటేశ్వరరావు, కుంచే శాంతమ్మ కుటుంబాలకు చెందిన తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారి ఎం.రాజా అధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో వివిధ ధ్రువీకరణ పత్రాలు, వడ్రంగికి సంబంధించిన ఫర్నీచర్‌, నగదు, 30 కొబ్బరి చెట్లు, వివిధ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. సర్పంచ్‌ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్‌ దంపతులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా బియ్యం, పంచదార అందజేశారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

తుని: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రేగుపాలెం – నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి (50) పట్టలు దాటుతుండగా, రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తెలుపు చొక్కా, నలుపు రంగు షార్ట్‌ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని తుని మార్చురీలో భద్రపరిచారు. వివరాలకు 94906 19020 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement