రావులపాలెం: కారు టైరు పేలడంతో ఆ కారు డివైడర్‌ను దాటి అవతల దారిలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. రావులపాలెం మండలంలో ఈతకోట టోల్ ప్లాజా సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన బొండాల నరసింహ గుప్తా (55) మృతి చెందారు. పాలకొల్లుకు చెందిన గుప్తా భార్య వీర వెంకట లక్ష్మీదేవితో కలిసి రాజమహేంద్రవరం బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈతకోట టోల్ ప్లాజా దాటాక కొంతదూరంలో కారు టైరు పేలడంతో ఆ కారు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన కేవీఎస్‌ఎస్ రామారెడ్డి, దివ్య పద్మజ్యోతి దంపతులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. వీరు రాజమహేంద్రవరం నుంచి పాలకొల్లు బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గుప్తా, అతని భార్య వీర వెంకట లక్ష్మీదేవి, మరో కారులో ఉన్న జ్యోతి గాయపడ్డారు. వీరిని హైవే అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో గుప్తా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలిని రావులపాలెం పోలీసులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. హైవే టోల్ ప్లాజా సిబ్బంది క్రేన్ సాయంతో కార్లను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న
మరో కారును ఢీకొట్టిన వైనం
ఇద్దరికి గాయాలు
రెండు కార్లు ఢీ : ఒకరి మృతి
రెండు కార్లు ఢీ : ఒకరి మృతి
రెండు కార్లు ఢీ : ఒకరి మృతి