పేపర్‌మిల్‌లో గ్యాస్‌ లీకేజీ కలకలం | - | Sakshi
Sakshi News home page

పేపర్‌మిల్‌లో గ్యాస్‌ లీకేజీ కలకలం

Jul 3 2025 5:26 AM | Updated on Jul 3 2025 5:26 AM

పేపర్‌మిల్‌లో గ్యాస్‌ లీకేజీ కలకలం

పేపర్‌మిల్‌లో గ్యాస్‌ లీకేజీ కలకలం

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి ఆంధ్రపేపర్‌ మిల్లులో గ్యాస్‌ లీకేజీ కలకలం సృష్టించింది. పేపర్‌ మిల్లు నార్త్‌ గేటు వద్ద ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. గత నెల 29వ తేదీన బరోడా నుంచి రాజమండ్రి పేపర్‌ మిల్‌కు హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌ లోడులో ఓ ట్యాంకర్‌ వచ్చింది. ట్యాంకర్‌లోని గ్యాస్‌ను వెంటనే దిగుమతి చేసుకోకపోవడంతో, ట్యాంకర్‌ అలాగే ఉండిపోయింది. నాలుగు రోజులుగా పేపర్‌ మిల్‌ నార్త్‌ గేటు వద్ద ట్యాంకర్‌ నిలిపేశారు. బుధవారం ఉదయం నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమివ్వడంతో వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక దళ వాహనాలు గ్యాస్‌ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు చేపట్టారు. ఘటన స్థలానికి పక్కనే పెట్రోల్‌ బంక్‌, పేపర్‌ మిల్‌ టింబర్‌ డిపో ఉన్నాయి. దీంతో ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని పరిసర ప్రాంతాల ప్రజలు భీతిల్లారు.

వ్యూహాత్మకంగా నియంత్రణ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉదయం 9.15 నిమిషాలు.. రాజమహేంద్రవరం ఫైర్‌ ఆఫీసుకు ఫోన్‌ వచ్చింది. పేపర్‌ మిల్‌కు వచ్చిన తన లారీ ట్యాంకర్‌ నుంచి హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌ లీక్‌ అవుతుందని చెప్పాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆర్యాపురం ఫైర్‌ ఆఫీసు నుంచి ఫైరింజిన్‌ బయలుదేరింది. ట్యాంకర్‌ నుంచి లీకవుతున్న హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌ అధిక మొత్తంలో వ్యాపిస్తే, దానిని పీల్చిన వారి ఊపిరితిత్తులు పాడైపోతాయి. శరీరంపై పడితే పెద్ద బొబ్బలు ఏర్పడుతాయి. అప్రమత్తమైన అగ్నిమాపక బృందాలు జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ మార్టిన్‌ లూథర్‌కింగ్‌ నేతృత్వంలో సంఘటన స్థలంలో నియంత్రణ చర్యలు చేపట్టాయి. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ వద్దనున్న ఫైర్‌ ఆఫీసు నుంచి మరో రెండు, కొవ్వూరు నుంచి ఒక ఫైరింజిన్‌ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టెండర్‌ వాహనాన్నీ రప్పించారు. హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌ లీకేజీతో ప్రజలకు ఏం కాకుండా పోలీసుల సహకారంతో పేపర్‌ మిల్‌ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ట్యాంకర్‌లోని హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేలా అగ్నిమాపక అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక కెమికల్‌ సూట్లు, సెపరేట్‌ డ్రెస్‌ను ధరించారు. ట్యాంకర్‌లో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూలింగ్‌ వాటర్‌, వాయువులను చిమ్మారు. ఆపరేషన్‌ ప్రారంభించిన ఉదయం 9.30కు 47 డిగ్రీలున్న ఉష్ణోగ్రతను, మధ్యాహ్నం 12 గంటలకు 26 డిగ్రీలకు తగ్గించగలిగారు. లీకవుతున్న హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌పై నీటిని చల్లి, భూమిలోకి ఇంకిపోయేలా చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్‌ నుంచి హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌ పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టిన ఫైరాఫీసర్‌ శ్రీనివాస్‌, అగ్నిమాపక సిబ్బందిని అందరూ అభినందించారు.

4 గంటలు శ్రమించి నియంత్రించిన

అగ్నిమాపక యంత్రాంగం

భీతిల్లిన పరిసర ప్రాంతాల ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement