
‘ప్రైవేటు’లో నిలువుదోపిడీ
ప్రైవేటు, కార్పొరేట్
విద్యా సంస్థలు ప్రభుత్వ
నిబంధనలను తుంగలో తొక్కి
మరీ ఇష్టానుసారం ఫీజుల దోపిడీ
సాగిస్తున్నాయి. ఎల్‌కేజీ నుంచి పదో
తరగతి వరకూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి.
దీంతో పాటు యూనిఫాం, ఇతర వస్తువులు అంటూ మోత
మోగించేస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రైవేటు,
కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తల్లిదండ్రులను
ఫీజుల రూపంలో నిలువుదోపిడీ చేస్తున్నాయి.
– ఎస్.కిరణ్ కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి