
మరిడమ్మ దర్శనానికి భక్తుల బారులు
పెద్దాపురం: ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే మరిడమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా తొలి ఆదివారం మరిడమ్మ తల్లి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి భక్తులకు సౌకర్యాలు చేపట్టారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతర ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు ఎస్‌ఐ మౌనిక ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు ఆదివారం పులిహోర అందజేశారు. ఏటా నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు ఉచితంగా పులిహోర పంపిణీ చేశారు.
ఘనంగా చేపల వీధి సంబంరం
స్థానిక చేపల వీధి సంబరం అంబరాన్నంటింది. భారీ సంఖ్యలో భక్తులు వీధి సంబంరంలో పాల్గొని సందడి చేశారు. కోలాటం, మ్యూజికల్ నైట్, కాళికావేషాలు, దేవతామూర్తుల వేషధారణలు, భారీ విద్యుద్దీలంకరణల మధ్య వైభవంగా నిర్వహించారు.

మరిడమ్మ దర్శనానికి భక్తుల బారులు

మరిడమ్మ దర్శనానికి భక్తుల బారులు