
గాడాలలో ఎద్దుల బలప్రదర్శన
కోరుకొండ: మండలంలోని గాడాలలో మంగళవారం ఎద్దుల బలప్రదర్శన పోటీ జరిగింది. పోటీల్లో రాజానగరం నియోజకవర్గంలోని 25 జతల ఎద్దులు పాల్గొన్నాయి. తక్కువ సమయంలో నిర్ణీత ప్రదేశానికి ఎద్దుల బండితో చేరుకున్న ఎద్దులకు బహుమతులు అందజేశారు. చక్రద్వారబంధానికి చెందిన శ్రీను ఎద్దులకు ప్రధమ బహుమతి రూ.10 వేలు, ట్రోఫీ, మురముండకు చెందిన సురేష్ గౌడ ఎద్దులకు రూ.8 వేలు, తోకలంక ఎద్దులకు రూ.7 వేలు, సీతానగరానికి చెందిన ఎద్దులకు రూ.6 వేలు, గాడాలకు చెందిన శ్రీను ఎద్దులకు రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు. పాల్గొన్న ఎద్దుల యజమానులందరికీ రూ.వెయ్యి చొప్పున అందజేశారు. స్థానికనాయకులు, రైతులు పాల్గొన్నారు.

గాడాలలో ఎద్దుల బలప్రదర్శన