అందరూ సేవా కార్యక్రమాలు చేయాలి | Sakshi
Sakshi News home page

అందరూ సేవా కార్యక్రమాలు చేయాలి

Published Tue, Jan 2 2024 2:20 AM

కల్యాణ మంటపాన్ని ప్రారంభిస్తున్న 
చాగంటి కోటేశ్వరరావు 
 - Sakshi

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

పిఠాపురం: గ్రామాల్లో ఉండే ఆలయాల పరిరక్షణతో పాటు అందరు సేవా కార్యక్రమాలు చేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రజలకు సూచించారు. ఆయన సోమవారం గొల్లప్రోలు మండలం ఏ మల్లవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నిర్మించిన కల్యాణ మంటపాన్ని ప్రారంభించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నేత కడింశెట్టి కుమార భాస్కరరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement