శ్రీరాముని అక్షతలతో శోభాయాత్ర | Sakshi
Sakshi News home page

శ్రీరాముని అక్షతలతో శోభాయాత్ర

Published Tue, Jan 2 2024 2:20 AM

శ్రీరాముని పూజ అక్షతలతో 
శోభాయాత్ర నిర్వహిస్తున్న సభ్యులు  - Sakshi

బోట్‌క్లబ్‌ (కాకినాడ): శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ నుంచి వచ్చిన శ్రీరామ పూజిత అక్షతలను కాకినాడలో ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆదిత్య శర్మ తెలిపారు. సోమవారం నగరంలో పూజా అక్షతలతో శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌, విశ్వహిందూ పరిషత్‌, వివిధ క్షేత్రాల సంయుక్త ఆధ్వర్యంలో అక్షతల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ పెద్ది రత్నాజీ, ఈఓ చింతపల్లి విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement