25 నుంచి కెనాల్‌ రోడ్డుకు మరమ్మతులు | Sakshi
Sakshi News home page

25 నుంచి కెనాల్‌ రోడ్డుకు మరమ్మతులు

Published Tue, Dec 19 2023 2:52 AM

వైఎస్సార్‌ సీపీ మండల 
కన్వీనర్‌ సత్తి రామకృష్ణారెడ్డి  - Sakshi

అనపర్తి: ఈ నెల 25 నుంచి వేమగిరి–సామర్లకోట కెనాల్‌ రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ సత్తి రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కెనాల్‌ రోడ్డు అభివృద్ధి జరగకపోవడానికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కెనాల్‌ రోడ్డు అభివృద్ధికి రూ.220 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరయ్యాయన్నారు. అయితే పనులు ప్రారంభించే సమయానికి అధికారంలోకి వచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రోడ్డు అభివృద్ధికి టెండర్‌ దక్కించుకున్న సంస్థతో కుమ్మకై ్క మొబలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద పెద్ద మొత్తంలో నిధులు దోచుకున్నారని విమర్శించారు. అప్పడు టీడీపీ ప్రభుత్వ నేతలు చేసిన పాపం ఇప్పుడు ప్రయాణికులకు శాపంగా మారిందన్నారు. కెనాల్‌ రోడ్డు గోతులమయంగా మారడంతో గతంలో రెండు పర్యాయాలు ప్రభుత్వ నిధులతో, ఒకసారి ఎమ్మెల్మే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి తన సొంత సొమ్ముతో మరమ్మతులు చేయించారన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే మరోసారి తన సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టేందుకు ముందుకొచ్చారని చెప్పారు.

Advertisement
 
Advertisement