సామాజిక సాధికార జాతర | Sakshi
Sakshi News home page

సామాజిక సాధికార జాతర

Published Thu, Nov 16 2023 6:18 AM

కొత్తపేటలో బస్‌యాత్ర ఏర్పాట్లు 
పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ జగ్గిరెడ్డి  - Sakshi

కొత్తపేట: గత నాలుగున్నరేళ్లలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, అన్ని వర్గాలకు చేసిన సామాజిక సమ న్యాయం గురించి ప్రజలకు వివరించేందుకు గురువారం మధ్యాహ్నం కొత్తపేట నియోజకవర్గంలో సామాజిక సాధికారత బస్సు యాత్ర జరగబోతోంది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో యాత్ర ప్రారంభమై నియోజకవర్గ కేంద్రం కొత్తపేట చేరుకుంటుంది. అక్కడ భారీ బహిరంగ సభ జరగనుంది.

పాల్గొననున్న ప్రముఖులు

కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జోగి రమేష్‌, మంత్రులు పినిపే విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎంపీలు మిధున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, చింతా అనూరాధ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌, జిల్లా, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, బొమ్మి ఇజ్రాయిల్‌, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, జక్కంపూడి రాజా, రుడా చైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సామాజిక వర్గాల నాయకులు పాల్గొంటారు.

బస్‌యాత్రకు భారీ ఏర్పాట్లు

సామాజిక సాధికారత బస్సు యాత్రకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రావులపాలెం ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల గ్రౌండ్‌ నుంచి బస్‌ యాత్రతో పాటు దానికి ముందు భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ సాగనుంది. కళాశాల వద్ద బస్‌కు క్రేన్‌తో భారీ గజమాల, కోనసీమ ముఖద్వారం వద్ద 500 కొబ్బరి బొండాలతో ఏర్పాటు చేసిన దండను రెండు క్రేన్‌ల సాయంతో వేయనున్నారు. రావులపాలెం హైస్కూల్‌ సెంటర్‌ నుంచి కొత్తపేట వరకూ ఐదు చోట్ల భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

 
Advertisement
 
Advertisement