పేదల ఆరోగ్య భద్రతకు భరోసా | Sakshi
Sakshi News home page

పేదల ఆరోగ్య భద్రతకు భరోసా

Published Thu, Nov 16 2023 6:18 AM

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరంలో సేవలు అందిస్తున్న డాక్టర్లు  - Sakshi

జగనన్న ఆరోగ్య సురక్ష

కార్యక్రమం వివరాలు

జిల్లాలో వైద్యశిబిరాలు 441

గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలు 368

పట్టణ ప్రాంతాల్లో శిబిరాలు 73

వినియోగించుకున్నవారు 2,30,080

మహిళలు 1,22,603

పురుషులు 1,07,427

కొత్తగా షుగర్‌ బాధితులు 6,970

కొత్త బీపీ బాధితులు 8,709

నేత్ర సమస్యలున్నవారు 36,883

కళ్లద్దాలు పొందినవారు 27,208

కంటి శస్త్రచికిత్సలు 2,777

రక్తహీనత ఉన్నవారు 32,811

టీబీ పరీక్షలు 17,868

కొత్తగా గుర్తించిన టీబీ బాధితులు 37

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు

రిఫర్‌ చేసిన కేసులు 6,811

ఆరోగ్యశ్రీ సేవలు పొందిన వారు 1,503

రాజమహేంద్రవరం రూరల్‌: పేదల ఇంటి ముంగిటకే మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించింది. మారుమూల గ్రామాలకు సైతం వైద్యులను పంపించి సేవలందించింది. ప్రతి ఇంటింటినీ సర్వే చేయించి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గుర్తించి మరీ చికిత్స చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్యశిబిరాలను ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారందరిని జగన్‌ ప్రభుత్వం ఆరోగ్య భరోసా కల్పించింది.

సెప్టెంబర్‌ 15న ప్రారంభం

జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్‌ 15న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9,416 మంది వలంటీర్లు, 368 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, 512 మంది ఏఎన్‌ఎంలు, 1,310 మంది ఆశా కార్యకర్తలు సుమారు 5,80,385 ఇళ్లకు వెళ్లి 14,34,609 మందిని ఆరోగ్య సర్వే చేశారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారితో ఆరోగ్యశ్రీ సిటిజన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. అనుమానిత వ్యక్తులకు బీపీ, మధుమేహం వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటి వద్దే చేయించారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి టోకెన్లు ఇచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు హాజరు కావాలని సూచించారు.

ముగిసిన వైద్యశిబిరాలు

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదీన ప్రారంభమైన జిల్లాలో వైద్యశిబిరాలు బుధవారంతో ముగిశాయి. జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుని ముందస్తు ప్రణాళికతో శిబిరాలను విజయవంతంగా నడిపించారు. ఇందుకు స్పెషలిస్టు డాక్టర్లతో పాటు 107 మంది ప్రభుత్వ వైద్యులను కేటాయించారు. వారు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్యసేవలను అందించారు. నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వీటిని నిర్వహించారు. కార్పొరేట్‌ తరహాలో రోగుల వివరాలను పొందుపరచడం, వారికి ఫైల్స్‌ ఇవ్వడంతో పాటు చికిత్స అందించారు.

ఆరోగ్య భరోసా

జగనన్న ఆరోగ్య సురక్షతో పిల్లల నుంచి వృద్ధుల వరకూ భరోసా కలిగింది. ప్రభుత్వం వాడవాడలా శిబిరాలు ఏర్పాటు చేసి, మెరుగైన వైద్యం అందించడంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికంగా గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకున్నారు. కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు అందజేశారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేసి, శస్త్రచికిత్సలు చేయించారు. అర్హులైన వారికి వైఎస్సార్‌ ఆసరా కింద రూ.5 వేలు అందజేశారు.

ముగిసిన జగనన్న ఆరోగ్య సురక్ష

కార్యక్రమం

జిల్లాలో 441 వైద్యశిబిరాల నిర్వహణ

2,30,080 మందికి వైద్యసేవలు

ఉచితంగా పరీక్షలు, మాత్రల పంపిణీ

1,503 మందికి ఆరోగ్యశ్రీ చికిత్స

పేదల ఆరోగ్యమే ధ్యేయం

పేదలకు అందని ద్రాక్షగా ఉన్న వైద్యసేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కొత్త ఆలోచనతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లెలకు డాక్టర్లు రావడం ప్రజలు గొప్పవరంగా భావిస్తున్నారు. నెలన్నర రోజులపాటు వైద్యాధికారులతో ఇతరశాఖల అధికారులు సమన్వయంతో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలను విజయవంతం చేశారు. జిల్లాలో 2.30 లక్షల మంది వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకున్నారు.

– డాక్టర్‌ కె.మాధవీలత, కలెక్టర్‌

ఇంటింటా ఆరోగ్య సర్వే

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు, వైద్యసిబ్బంది సర్వే చేసి, అనారోగ్య సమస్యలున్న వారిని జల్లెడ పట్టారు. దీంతో పలు వ్యాధులు బయటపడ్డాయి. ప్రధానంగా బీపీ, మధుమేహం, కంటి సమస్యలు, టీబీ వ్యాధులు వెలుగులోకి వచ్చాయి. వారంతో ఇప్పుడు చికిత్స తీసుకునే పనిలో పడ్డారు. సకాలంలో తగిన వైద్యం చేసేందుకు ఈ సురక్ష తోడ్పడింది. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులకు వైద్యశిబిరాలు ఉపయోగకరంగా మారాయి.

– డాక్టర్‌ వసుంధర, ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌వో

1/2

2/2

Advertisement
 

తప్పక చదవండి

Advertisement