యువమోర్చా ఇన్‌చార్జిగా కొండ | Sakshi
Sakshi News home page

యువమోర్చా ఇన్‌చార్జిగా కొండ

Published Thu, Nov 16 2023 6:14 AM

నాగసుధా కొండ - Sakshi

అమలాపురం రూరల్‌: తూర్పుగోదావరి జిల్లా యువమోర్చా ఇన్‌చార్జ్‌గా అమలాపురానికి చెందిన యల్లమిల్లి నాగసుధా కొండను నియమించారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ రాష్ట్ర పధాధికారులకు ఈ బాధ్యత అప్పగించారు. రాష్ట్ర ఆర్‌టీఐ సెల్‌ కన్వీనర్‌గా ఉన్న యల్లమిల్లి నాగ సుధా కొండలరావును తూర్పు గోదావరి జిల్లాకి ఇన్‌చార్జిగా నియమించారు. నియామక పత్రాన్ని భారతీయ జనతా యువమోర్చ జాతీయ కార్యదర్శి వినీత్‌ త్యాగి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, జాతీయ యువమోర్చ కార్యవర్గ సభ్యుడు ఉప్పిలి వంశీ చేతుల మీదుగా కొండ అందుకున్నారు. పార్టీలో సీనియర్‌గా కొండ సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చారు. గతంలో యువమోర్చ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనరల్‌ సెక్రటరీ, జోనల్‌ ఇన్‌చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కవితల పోటీ కో కన్వీనర్‌గా ఆయన పనిచేశారు.

Advertisement
Advertisement