డ్వాక్రా మహిళకు బ్యాంకులో టోకరా | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా మహిళకు బ్యాంకులో టోకరా

Published Thu, Nov 16 2023 6:14 AM | Last Updated on Thu, Nov 16 2023 6:14 AM

తుని బ్యాంకులో డ్వాక్రా మహిళను మోసగించిన
అపరిచిత వ్యక్తి చిత్రం - Sakshi

తుని: బ్యాంకుకు డ్వాక్రా సొమ్మును కట్టడానికి వెళ్లిన మహిళను అపరిచిత వ్యక్తి మోసం చేసి రూ.28,600 స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితరాలు నూకరత్నం చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పార్కుసెంటర్‌ రోడ్డులో ఉన్న చైతన్య గోదావరి బ్యాంకుకు సెప్టెంబర్‌ 7వ తేదీన ఆమె వెళ్లింది. బ్యాంకుకు సొమ్ము చెల్లించేందుకు సేవింగ్‌ ఫారం పూర్తి చేయడం తెలియక పోవడంతో అక్కడే ఉన్న వ్యక్తిని ఆశ్రయించింది. ఆ అపరిచిత వ్యక్తి ఆమె నుంచి రూ.28,600 తీసుకుని ఒక ఫారంలో రూ.27,500, మరో ఫారంలో రూ.1,100 నమోదుచేసి బ్యాంకుకు చెల్లించినట్టు నటించి, వాటిపై బ్యాంకు సీల్‌ వేసి నూకరత్నంకు ఇచ్చాడు. ఆమె ఇంటికి వెళ్లి పోయింది. డ్వాక్రా రుణానికి సంబంధించి సొమ్ము చెల్లించడంతో గ్రూపు సభ్యులతో కలిసి బుధవారం బ్యాంకుకు వచ్చింది. బ్యాంకు సిబ్బందిని సంప్రదించి తమకు మళ్లీ రుణం ఇవ్వాలని అడిగారు. సదరు సిబ్బంది మీ గ్రూపునకు సంబంధించి రూ.28,600 కట్టాల్సి ఉందని చెప్పారు. దీంతో షాక్‌కు గురైన నూకరత్నం సెప్టెంబరు నె7వ తేదీన మొత్తం సోమ్మును చెల్లించామని రశీదు చూపించింది. ఖాతా తనిఖీ చేయగా అందులో సొమ్ము చెల్లించినట్టు లేదు. దీంతో బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా తమకు సంబంధం లేదని, ఎంతోమంది రోజూ బ్యాంకు వస్తారని చెప్పారు. సొమ్ము చెల్లించిన తేదీని చెప్పడంతో బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా నూకరత్నం నుంచి సొమ్ము తీసుకున్న వ్యక్తిని గుర్తించారు. తమకు న్యాయం చేయాలని బ్యాంకు అధికారికి, పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు.

రూ.28,600 సొమ్ము స్వాహా

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement