సత్యదేవుని గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

సత్యదేవుని గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు

Published Wed, Nov 15 2023 7:21 AM

విలేకర్ల సమావేశంలో ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌ - Sakshi

మీడియాతో ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌

అన్నవరం: అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈనెల 27న కార్తిక పౌర్ణమి సందర్బంగా గిరిప్రదక్షిణ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్‌ అజాద్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్తికమాసం సందర్బంగా చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. ఈసారి సోమవారం పౌర్ణమి రానున్నందున గిరిప్రదక్షిణలో లక్షకు పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం ఎనిమిది గంటలకు కొండ దిగువన తొలిపాంచా నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. అక్కడ నుంచి అన్నవరం మెయిన్‌రోడ్‌ మీదుగా బెండపూడి శివారు పుష్కర కాల్వ రోడ్డు మీదుగా సత్యగిరి, రత్నగిరి చుట్టూ ప్రదక్షిణ చేశాక పంపా ఘాట్‌ వద్దకు చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ జరిగే మార్గంలో ప్రతీ కిలోమీటర్‌ వద్ద మంచినీరు, పండ్లు, పులిహోర, మజ్జిగ, పాలు తదితర ఆహార పదార్ధాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని పంపిణీ చేసేందుకు ఆసక్తి కలిగిన దాతలు ఫోన్‌ నంబర్లలో (90300 59998, 83673 74978, 99519 97666 ) సంప్రదించాలని ఈఓ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement