అర్హులందరికీ పథకాల ప్రయోజనం | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ పథకాల ప్రయోజనం

Published Sat, Nov 11 2023 2:44 AM

కాతేరులో డిజిటల్‌ బోర్డును పరిశీలిస్తున్న జిల్లాకలెక్టర్‌ మాధవీలత  - Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందజేస్తోందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు సచివాలయం పరిధిలో శుక్రవారం వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె డిజిటల్‌ బోర్డును ఆవిష్కరించి, అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కాతేరు గ్రామ సచివాలయం–1 పరిధిలో డీబీటీ, నాన్‌ డీబీటీ కింద 5314 మంది లబ్ధిదారులకు రూ.18,52,16,259 ప్రయోజనం చేకూర్చడం జరిగిందన్నారు.అర్హత కలిగి సంక్షేమ పథకాల ప్రయోజనం అందక పోతే.. వలంటీర్‌ ద్వారా గ్రామ సచివాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాతేరు గ్రామస్తులకు తొర్రేడు లే అవుట్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. కాతేరు సచివాలయం పరిధిలో 31 పథకాల కింద రూ.18.52 కోట్ల మేర ప్రయోజనం చేకుర్చామన్నారు. డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి కె.వీణాదేవి, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, నోడల్‌ ఆఫీసర్‌ తాడి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి కె.హనుమంతరావు, మండల జేసీఎస్‌ ఇన్‌చార్జి తాటికొండ విష్ణుమూర్తి, కాతేరు సచివాలయ కన్వీనర్లు ఆచంట కల్యాణ్‌ రామ్‌, బాగాల వెంకట రామారావు, బళ్లా సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ నాయకులు యెజ్జు వాసు, మద్దా దుర్గారావు, మేకా సూర్యారావు, ఆచంట సాయిబాబు, రంజిత్‌, పెనుమాక సునీల్‌, దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ మాధవీలత

ఉత్సాహంగా ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’

 
Advertisement
 
Advertisement