‘ఆడుదాం ఆంధ్ర’పై అవగాహన కల్పించాలి | Sakshi
Sakshi News home page

‘ఆడుదాం ఆంధ్ర’పై అవగాహన కల్పించాలి

Published Sat, Nov 11 2023 2:44 AM

ఆడుదాం ఆంధ్రపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ మాధవీలత, జేసీ తేజ్‌ భరత్‌ - Sakshi

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆడుదాం ఆంధ్ర యువజన క్రీడల టోర్నమెంట్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్‌ మాధవీలత అధికారులకు సూచించారు. ఆ టోర్నమెంట్‌పై శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌న నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో 15 ఏళ్లు పైబడిన యువకులకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. దీనిపై ఆయా సచివాలయాల్లో పరిధిలో ప్రచారం చేపట్టాలన్నారు. ఆటలతో ఆరోగ్యకర జీవనం అలవడుతుందన్నారు. క్రికెట్‌, యోగా, వాలీబాల్‌, టెన్నికాయిట్‌, కబడ్డీ, ఖోఖో, మారథాన్‌, బ్యాడ్మింటన్‌, ఇతర సంప్రదాయ ఆటల పోటీలు జరుగుతాయన్నారు. ఇందుకోసం 19 మండలాల్లో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి ఇన్‌చార్జులను నియమించామన్నారు. దీపావళి షెడ్యూల్‌ తర్వాత నవంబర్‌ 15 నుంచి 18 వరకూ నిర్వహించే ఐదు విభాగాలకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో క్రీడా వలంటీర్లకు శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో 393 గ్రామ, 119 వార్డు సచివాలయాల నుంచి 512 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, డీఎల్డీవో వీణాదేవి, జిల్లా స్పోర్ట్స్‌ అధికారి ఎంవీవీ శేషగిరిరావు పాల్గొన్నారు.

పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు, తద్వారా మహిళల ఆర్థిక పరిపుష్టికి జగనన్న పాల వెల్లువ ఎంతో దోహదపడుతుందని కలెక్టర్‌ మాధవీలత అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపై సంబంధిత మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పాడి పశువుల అభివృద్ధికి సంబంధిత అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. నవంబరు 15 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా ఈనెల 30వ తేదీ వరకూ సర్వే నిర్వహించి, లబ్ధిదారుల నుంచి అంగీకారం తీసుకోవాలన్నారు. డిసెంబర్‌ ఒకటి నాటికి రైతుల నుంచి పూర్తి స్థాయిలో డ్యాక్యుమెంటేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పాడి పశువుల పెంపకానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించా మన్నారు. మండలాల వారీగా యానిమల్‌ గ్రౌండింగ్‌ యూనిట్లగా మొత్తం 1500 మంది రైతులకు 1400 యూనిట్లను అందించామన్నారు. జేసీ ఎన్‌.తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ శ్రీనిధి, చేయూత లబ్ధిదారులను పాడి పశువులను కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్‌ ఎస్‌జీటీ సత్యగోవింద్‌, డీఎల్‌డీవో పి.వీణా దేవీ, ఎల్‌డీఎం డి.దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ మాధవీలత

నిర్వహణపై అధికారులతో సమీక్ష

Advertisement
 
Advertisement