25 టన్నుల బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

25 టన్నుల బియ్యం పట్టివేత

Published Sat, Nov 11 2023 2:44 AM

పట్టుబడిన బియ్యం లారీ - Sakshi

కొవ్వూరు: అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పౌర సరఫరా అధికారులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్‌ జి.బాపిరాజు శుక్రవారం ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం నుంచి కాకినాడ పోర్టుకు లారీలో భారీగా రేషన్‌ బియ్యం తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలూ చూపకపోవడంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిడదవోలులోని పౌర సరఫరాల గోదాముకు తరలించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ కం ఓనర్‌ షేక్‌ నాగూర్‌ మీరా, బియ్యం పంపిన వ్యాపారి ఖమ్మం నగరానికి చెందిన ఎ.వెంకటేశ్వరరావుపైన 6ఏ కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.10 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. లారీతో కలిపి పట్టుకున్న సొత్తు రూ.23 లక్షలని బాపిరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement