ల్యాభదాయకమేనా? | Sakshi
Sakshi News home page

ల్యాభదాయకమేనా?

Published Thu, Oct 26 2023 11:58 PM

సైన్స్‌ ప్రయోగాలు చేస్తున్న విద్యార్థులు - Sakshi

రాయవరం/కంబాలచెరువు(రాజమహేంద్రవరం): విద్యా ర్థుల్లో శాసీ్త్రయ దృక్ఫథం పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్‌ ప్రయోగాలు ఎంతో ఉపకరిస్తాయి. ఎందుకు.. ఏమిటి.. ఎలా.. అంటూ ప్రశ్నించేతత్వం విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రభుత్వం విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇన్‌స్ఫైర్‌ మనక్‌, జిల్లా సైన్స్‌ కాంగ్రెస్‌ తరఫున ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ ప్రయోగాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చాలంటే పాఠశాల స్థాయిలో నేర్చుకునే సైన్స్‌ పాఠాలకు అనుగుణంగా ప్రయోగాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం పాఠశాలల్లో సైన్స్‌ ప్రయోగాలు ఎలా నిర్వహిస్తున్నారు, విద్యార్థులకు సైన్స్‌ ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందిస్తున్నారా? లేదా? అనే విషయాలను తెలుసుకునేందుకు సైన్స్‌ ల్యాబ్‌ల తనిఖీకి టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులను టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో సభ్యులుగా నియమించారు.

ప్రత్యేక ప్రాధాన్యం

విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన ప్రభుత్వం సైన్స్‌ ల్యాబ్‌ల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాభివృద్ధికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల దశ నుంచే సైన్స్‌పై ఆసక్తి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో సర్కారు బడుల విద్యార్థులు రాణించేలా తోడ్పాటునందిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న సైన్స్‌ ల్యాబ్‌ల అమలుతీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందం జిల్లాకు రానుంది.

సర్కారు ప్రత్యేక శ్రద్ధ

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్‌ల వినియోగాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనుంది. ల్యాబ్‌ల నిర్వహణ, ఉపయోగిస్తున్న విధానం, ల్యాబ్‌ రికార్డులు పరిశీలించనున్నారు. జనరల్‌ ల్యాబ్స్‌, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌, స్టెమ్‌ ల్యాబ్స్‌ను టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ సభ్యులు పరిశీలించనున్నారు. గతంలో పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసిన గణితం, సైన్స్‌ కిట్స్‌ వినియోగంపై కూడా పరిశీలన చేస్తారు. టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లో రాష్ట్ర విద్యా పరిశోధన మండలి నుంచి ఒక నోడల్‌ అధికారి, సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి ఒక నోడల్‌ అధికారి, జిల్లా సైన్స్‌ అధికారులు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌ ఉంటారు. ల్యాబ్స్‌ పరిశీలన అనంతరం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నివేదికను రాష్ట్ర సమగ్ర శిక్షా ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఈ మేరకు పాఠశాలల్లో ల్యాబ్‌ల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కోనసీమ జిల్లాలో 89 ప్రాథమికోన్నత, 234 ఉన్నత పాఠశాలల్లో జనరల్‌ సెన్స్‌ ల్యాబ్‌లతో పాటుగా, 45 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు, జెడ్పీహెచ్‌ఎస్‌, మొగలికుదురు (మామిడికుదురు మండలం), రాజోలు, జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల ఉన్నత పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్‌ దంగేరు (కె.గంగవరం మండలం)లో స్టెమ్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి.

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, అటల్‌ టింకరింగ్‌, స్టెమ్స్‌ ల్యాబ్స్‌ల వివరాలివీ

జిల్లా యూపీ హైస్కూల్స్‌ అటల్‌ స్టెమ్‌

ల్యాబ్స్‌ ల్యాబ్స్‌

కోనసీమ 89 234 45 03

కాకినాడ 105 245 49 02

తూర్పు 69 193 32 03

సైన్స్‌ ల్యాబ్‌ల

తనిఖీకి టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు

బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

29, 30, 31 తేదీల్లో పాఠశాలల్లో

ప్రయోగశాలల పరిశీలన

సైన్స్‌కు మంచి రోజులు

ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే సైన్స్‌కు మంచి రోజులు వచ్చినట్లుగా స్పష్టంగా అర్ధమవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం సైన్స్‌ ల్యాబులను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌, స్టెమ్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సైన్స్‌కు చక్కటి ప్రాధాన్యతనిస్తున్నారు.

– జీవీఎన్‌ఎస్‌ నెహ్రూ, జిల్లా సైన్స్‌ అధికారి

ప్రాక్టికల్స్‌ నిరంతరం చేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్‌ ప్రయోగాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌, స్టెమ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేశారు. మరిన్ని పాఠశాలల్లో ఏటీఎల్‌, స్టెమ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తనిఖీకి సిద్దంగా ఉండాలి.

– అబ్రహం, డీఈవో

స్టెమ్‌ ల్యాబ్‌
1/3

స్టెమ్‌ ల్యాబ్‌

2/3

3/3

Advertisement
 

తప్పక చదవండి

Advertisement